LG నుంచి ట్రూలీ స్ట్రెచబుల్ డిస్ప్లే ఫోన్ ! 1 m ago
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్జీ, ప్రపంచంలోనే మొదటి ట్రూలీ స్ట్రెచబుల్ డిస్ప్లేను పరిచయం చేసింది. ఈ డిస్ప్లేను 50 శాతం వరకు నాణ్యత తగ్గకుండా విస్తరించవచ్చు. 12 అంగుళాల పరిమాణంలో ఉన్న ఈ డిస్ప్లే, 18 అంగుళాల వరకు సాగుతుంది. ఈ డిస్ప్లే పిక్సెల్ నాణ్యత అధికంగా ఉండి, అంగుళానికి 100 పిక్సెల్స్ రిజల్యూషన్తో పాటు ఆర్జీబీ రంగులను కూడా అందిస్తుంది. గతంలో 2022లో ఎల్జీ స్ట్రెచబుల్ డిస్ప్లేను పరిచయం చేసినప్పటికీ, అప్పటి ప్రోటోటైప్ గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే విస్తరించేది.